పసిఫిక్ మహా సముద్రంపై పయనిస్తుండగా ఓ విమానం ఇంజిన్లో సమస్య తలెత్తడం
కలకలం రేపింది. విమానం న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వస్తుండగా ఈ సమస్యను
గుర్తించారు. వెంటనే మేడే అలర్ట్ జారీ చేశారు. విమాన గమ్యస్థానమైన సిడ్నీ
ఎయిర్పోర్టులో అత్యవసర సిబ్బందిని, అంబులెన్సులను మోహరించారు. చివరకు విమానం
సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.