హిరోషిమాలో ప్రఖ్యాత జపనీస్ రచయిత, హిందీ, పంజాబీ భాషావేత్త, పద్మశ్రీ డాక్టర్
టోమియో మిజోకామితో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సంభాషించారు. జపాన్‌లో
భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో రెండు దేశాలను మరింత దగ్గర చేయడంలో
మిజోకామి చేసిన కృషికి ప్రధాని ప్రశంసించారు.
శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని
ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత్-జపాన్ మధ్య స్నేహానికి గుర్తుగా భారత్ గాంధీ ప్రతిమను జపాన్‌కు
బహుమతిగా ఇచ్చింది. 42 అంగుళాల పొడవైన గాంధీ కాంస్య ప్రతిమను పద్మభూషణ్
అవార్డు గ్రహీత రామ్ వంజీ సుతార్ తయారు చేశారు. గాంధీ విగ్రహం ఉన్న ప్రదేశం
శాంతి, అహింసకు సంఘీభావ చిహ్నంగా విరాజిల్లుతుందని మోడీ అన్నారు.జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ సమకాలీన
ప్రాంతీయ పరిణామాలు ఇండో-పసిఫిక్‌లో సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరు దేశాధినేతలు
చర్చించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరు,
ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై కూడా మోదీ, కిషిద చర్చించినట్లు తెలిపింది.
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ సమకాలీన
ప్రాంతీయ పరిణామాలు ఇండో-పసిఫిక్‌లో సహకారంపై చర్చించారు. ద్వైపాక్షిక
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరు దేశాధినేతలు
చర్చించారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరు,
ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై కూడా మోదీ, కిషిద చర్చించినట్లు తెలిపింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ
ఏడాదితో భారత్-దక్షిణ కొరియా దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయినందున
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు.
వాణిజ్యం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, ఐటీ హార్డ్‌వేర్ తయారీ, రక్షణ,
సెమీకండక్టర్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడానికి నేతలు అంగీకరించారు.