టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 34వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, క్రికెటర్లు, ప్రముఖులు, అభిమానులు కోహ్లీకి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. గ్రౌండ్ లో వీరుడిలా చెలరేగిపోయే విరాట్ తన ఇంట్లో మాత్రం పెద్ద జోకర్ లాగా ఉన్నాడు. అనుష్క షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. నెటిజన్లు అంతా ఇంట్లో విరాట్ కోహ్లీ పరిస్థితి ఇదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో విరాట్, అనుష్క ప్రేమ వ్యవహారం ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు విజయాలు అందిస్తున్నాడు. అనుష్క సినిమాల్లో కొనసాగుతూ రాణిస్తోంది.