ఆరోగ్య సమస్యల కారణంగా ఆగ్ర కథానాయిక సమంత ఏడాది పాటు నటనకు దూరంగా ఉండాలని
నిర్ణయించుకుందని గత కొద్ది రోజులు నుండి వార్తలొస్తున్నాయి. సమంత ఇన్ స్ట్రా
గ్రామ్ తాజా పోస్ట్ ఆ వార్తలను ధృవీకరించేలా కూడా ఉంది. ‘సిటాడెల్’ వెబ్
సిరీస్ షూటింగ్ ను పూర్తి చేసింది సమంత. ఈ సందర్భంగా చిత్ర బృందానికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్ స్ట్రా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. “సిటాడెల్’
షూటింగ్ పూర్తయింది. రానున్న రోజుల్లో ఏం చేయాలో ముందే తెలుసు కాబట్టి విరామం
తీసుకోవడం పెద్ద తప్పుగా అనిపించడం లేదు. మీరంతా నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా
భావించి ఆప్యాయత కనబరిచారు. నేను చేసిన ప్రతీ యుద్ధంలో వెన్నంటి ఉంటూ
ధైర్యాన్నిచ్చారు. మీ అందరిని గర్వపడేలా చేయాలన్నదే నా కోరిక’ అని సమంత తన
పోస్ట్ లో పేర్కొంది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లనుందని,
అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనుందని ప్రచారం జరుగుతున్నది. తాజా
పోస్ట్ ద్వారా ఆమె పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించిందని నెటిజన్లు
అభిప్రాయపడుతున్నారు.