విజయవాడ : సీ రాఘవాచారి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి
వ్యక్తిత్వంలోనే విలక్షణ తత్వం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినచసీ
రాఘవాచారి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాధ్ రెడ్డి సంస్మరణ సభకు ముఖ్య
అతిధిగా విచ్చేసిన ఆయన శ్రీనాథరెడ్డి గురించి మాట్లాడుతూ శ్రీనాధ్ రెడ్డి
యాక్సిడెంటల్ గా జర్నలిజంలోకి వచ్చారే తప్ప అదే వృత్తిగా ఎంచుకుని రాలేదని
అన్నారు. ఆయన స్వతహాగా భూస్వామ్య కుటుంబంలోనుంచి వచ్చిన వ్యక్తి అన్నారు.
అటువంటి కుటుంబంలోని వ్యక్తులకు సాధారణంగా పేదల కష్టనష్టాలు తెలియవు కాని
అందుకు భిన్నంగా రాయలసీమ కష్టాలు, కరువు, సమస్యలను శ్రీనాధ్ రెడ్డి
చవిచూశారన్నారు. ఆయన జర్నలిస్టుగా పనిచేస్తున్నపటినుంచీ శ్రీనాథరెడ్డి ఏమి
చేసినా కొత్తగా ఉండేదన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ భాగస్వామ్యంతో
జర్నలిస్టులకు అకాడమీ తరఫున సర్టిఫికెట్ కోర్సును అందించారన్నారు. ఆ
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేశారు. ఆయన ప్రెస్
అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు కోవిడ్ లోనూ ఎంతో బాధ్యతగా జర్నలిస్టుల కోసం
పనిచేసారన్నారు. ఆయన విలక్షణమైన వ్యక్తిత్వంతోఎంతోమందిని ప్రభావితం
చేయగలిగారని అన్నారు. ఆయన తనవద్ద ఉన్న మేధస్సును రచయితలకు, కధకులకు ఆయన
ముడిసరుకుగా ఇచ్చారన్నారు. అంతే కాకుండా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరపున రాయలసీమ
ఉద్యమాల్లో ఆయన కీలకమైన పాత్ర మరువలేనిదన్నారు.అంతేకాకుండా ప్రభుత్వం చేసిన
ప్రతీ కార్యక్రమాలను భుజాన వేసుకునేవారన్నారు. శ్రీనాధ్ రెడ్డి లేని లోటు
ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా తనకూ తీరని లోటని అన్నారు. శ్రీనాధ్ రెడ్డి
ఆత్మకి శాంతి కలగాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ శ్రీనాథరెడ్డి తన వృత్తిపట్ల
నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు. గత యాభై ఏళ్లుగా రాయలసీమలో ఆయన పోషించిన
పాత్ర మరువలేనిదన్నారు. శ్రీనాథ్‌రెడ్డి పేరు మీద యోగి వేమన యూనివర్శిటీ
జర్నలిజం విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించేందుకు కృషి చేయాలన్నారు.
శ్రీనాథ్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిజం
వృత్తిని, కార్మిక ఉద్యమాన్ని సమన్వయం చేసుకుంటూ శ్రీనాథ్‌రెడ్డి ముందుకు
సాగారన్నారు. తనకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండే వారన్నారు. ఆయనను ఒక మంచి
జర్నలిస్టుగా గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి
ఇవ్వడం ఎంతో సముచిత మైన స్థానాన్ని కల్పించినట్లు అయ్యిందన్నారు.ఏపీపీజేఏ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోషియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో రూపొందించిన
క్యాలెండర్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ
కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు ఎన్ సాంబశివరావుతో పాటు
పలువురు ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.