దసరా మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు అంగన్వాడి
టీచర్ల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా
కేంద్రంలో అంగన్వాడిలు ఆందోళనకు దిగారు. సమాజానికి ఎంతో సేవ చేస్తోన్న
అంగన్వాడి టీచర్లను దసరా మూవీలో దొంగలుగా చిత్రీకరించారని అంగన్వాడి టీచర్లు
ఆవేదన వ్యక్తంచేశారు. తమను, తాము ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చేస్తోన్న వృత్తిని
కించపరిచే సన్నివేశాలు పెట్టడం ద్వారా దసరా చిత్ర నిర్మాతలు, దర్శకుడు,
నటీనటులు తమను అవమానించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా
కేంద్రంలో దసరా మూవీని ప్రదర్శిస్తున్న థియోటర్ల ఎదుట అందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంగన్ వాడీ టీచర్లు.. దసరా మూవీలో తమని
కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. దసరా చిత్రంలో
అంగన్వాడీ టీచర్ల ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా తెరకెక్కించిన సన్నివేశాలు
తొలగించకపోతే.. రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని
స్పష్టంచేశారు.

ఇదిలావుంటే దసరా మూవీ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. ఇప్పటికే విడుదలైన
తొలి రోజే రూ. 38 కోట్లు వసూలు చేసి నాని కెరీర్లోనే డే 1 హైయెస్ట్ గ్రాసర్ గా
నిలిచిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మన ఇండియాలో రిలీజైన అన్ని
చిత్రాల్లోకెల్లా.. తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ రికార్డు
సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌తో సినిమా బాక్సాఫీస్ క్యాలిక్యులేషన్స్ మరింత
పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ఆడియెన్స్‌ని
మాస్త్ ఎంటర్టైన్ చేస్తోన్న దసరా మూవీ వసూళ్లపై అంగన్వాడీల ఆందోళన ప్రభావం ఏ
మేరకు ఉంటుందో వేచిచూడాల్సిందే.