పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చుట్టూ వివాదాలు
ఉన్నప్పటికీ ఆటలో మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. చివరి ప్రపంచ కప్ ఆడుతున్న
అతడిని ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా క్రీడపై తన ప్రభావాన్ని చూపుతూనే
ఉన్నాడు. తాజాగా రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్
టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా రొనాల్డో రికార్డు
సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్-2022 మెగా ఈవెంట్లో భాగంగా గురువారం ఘనాతో
జరిగిన మ్యాచ్లో పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించిన రొనాల్డో ఈ అరుదైన ఘనతను
తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్లో, అతను ఇప్పటికే తన జట్టు కోసం 700
గోల్స్ చేశాడు. మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్, క్లబ్ యజమానులను విమర్శించిన
ఇంటర్వ్యూ కారణంగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు రొనాల్డో దూరమైన విషయం
తెలిసిందే.