ప్రస్తుతం చేతినిండా
సినిమాలతో బిజీగా గడుపుతున్న మృణాల్ ఠాకూర్, ఇటీవలే ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో
కనిపించి అందరినీ అలరించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులు తనను
ఎంతో ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది. వివాహ వ్యవస్థపై
పూర్తి నమ్మకం ఉందన్న మృణాల్.. మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే
వారిని వివాహం చేసుకోవచ్చని చెప్పారు. “మా కుంటుంబంలో, బంధువుల్లో చాలామంది
వివాహానంతరం సంతోషంగా ఉన్నారు. వారంతా ఒకరికోసం ఒకరు పుట్టారా అన్నట్లు
ఉంటారు. మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే వారిని వివాహం
చేసుకోవడానికి వయసుతో పనిలేదని నా అభిప్రాయం. 18నుంచి 60 ఏళ్ల వరకు ఎప్పుడైనా
అలాంటి వారు మనకు తారస పడొచ్చు. అలాంటి వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకోండి”
అని చెప్పుకొచ్చారు.