అమరావతి : విశాఖకు కార్యాలయాలను తరలిస్తున్నారని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో తరలిస్తున్నారని అమరావతి రైతులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం విచారణ సింగిల్ జడ్జితోనా లేదా త్రిసభ్య ధర్మాసనం చేస్తుందా అనేదానిపై ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారు? ఏఏ అవసరాలకు ఎంత పరిధిలో భవనాలు నిర్మించారో పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.