పవన్ కళ్యాణ్ వి దిగజారుడు రాజకీయాలు
వికేంద్రీకరణతోనే అభివృద్ధి
పేదలకు ఇళ్లపై కుళ్ళు ఎందుకు
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని పాలనా
రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబితే విపక్షాలు విశాఖపై విషం
చిమ్ముతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మంగళవారం నరసన్నపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధానికి అవసరమైన
అన్ని వనరులు, అర్హతలు ఈ రాష్ట్రంలో విశాఖపట్నానికే ఉన్నాయన్నారు.? ఒకవైపు
గిరిజన ప్రాంతం, మరోవైపు సముద్రతీరం, మధ్యలో మైదానప్రాంతం ఇలా భౌగోళికంగా
అన్ని సహజవనరులు కూడా విశాఖకు ఉన్నాయని అన్నారు. విజ్ఞతలేని విపక్షాలు విశాఖ
రాజధాని అంటే వ్యతిరేకిస్తున్నాయన్నారు. టీడీపీ హయాంలో అమరావతిలో చేసినవి
తాత్కాలిక నిర్మాణాలేనని అన్నారు. చంద్రబాబు కృష్ణానది. గట్టుని ఆక్రమించి
చేసిన నిర్మాణాన్ని తొలగించినప్పుడు అది ఉన్నపళంగా పడిపోయిందంటే అంత డెలికేట్
అక్కడ నేల ఉందని గుర్తుచేశారు.
పచ్చని పంటలు పండే భూముల్ని కాజేయడానికే చంద్రబాబు అమరావతి రాజధాని అని
నాటకాలు ఆడారని అన్నారు. అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యవహారాలు తప్ప
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఏమీ జరగలేదని అన్నారు. ఇలాంటి అనాలోచిత
నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి మాత్రమే అనేలా కలరింగ్
ఇచ్చిన చంద్రబాబునాయుడుకు పవన్ కళ్యాణ్ వంతపాడుతూ అనాలోచిత వ్యాఖ్యలు
చేస్తుండడం సబబుకాదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందే చేపట్టిన
ప్రజాసంకల్పయాత్రలో ఇళ్లు లేని పేదలను చూసి వారికి సొంత ఇళ్లు ఇస్తామని
వాగ్దానం చేశారని, తాను గెలిచిన వెంటనే ఈ రాష్ట్రంలో 30లక్షల కుటుంబాలకు
ఇళ్లను మూడు విడతల్లో ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే తొలివిడతలో రూపు
దిద్దుకుంటున్న ఇళ్లన్నీ దాదాపుగా పూర్తయిన స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ వాటిపై
రాజకీయాలు చేయాలని చూస్తే లబ్దిదారులే తిప్పికొట్టారని అన్నారు. ఇప్పుడు
తయారవుతున్నవి కేవలం జగనన్న కాలనీలు కావని, ఏకంగా గ్రామాలే
రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. పేదలై ఉండి ఇళ్ల స్థలాలు పొందని వారు
దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా 90రోజుల్లో ఇళ్లు మంజూరు చేస్తున్నారని
తెలిపారు. ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ప్రజలే
బుద్ధి చెబుతారని అన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలు అతనికే అంతుపట్టని రీతిలో కొనసాగుతున్నాయని అన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబుని గెలిపించడానికి ఆయన తాపత్రయం
దిగజారుడు రాజకీయాలకు సంకేతమాని విమర్శించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల
పోటీచేసి ఒకచోట కూడా గెలవలేకపోయినా ఇంకా జ్ఞానం రాకపోవడం విచిత్రంగా
ఉందన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే విపక్షాలు ఎందుకు కుళ్లుకుంటున్నాయో అర్ధం
కావడం లేదన్నారు. ఎక్కడా ఒక ఇటుకని కూడా పెట్టలేడు అంటూ అసత్య ఆరోపణలు చేసే
నాయకులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లే కళ్లు తిరుచుకుంటాయన్నారు.
సరసన్నపేటలో జగనన్న కాలనీల్లో గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికైనా విపక్షాలు విజ్ఞతాయుతంగా ప్రవర్తించడం మంచిదని మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్ హితవు చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపిపి ఆరంగి మురళీధర్,
సుడా చైర్పర్సన్ ప్రతినిధి కోరాడ చంద్రభూషణ్ గుప్తా, చింటూ రామారావు, ముద్దాడ
బైరాగి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.