మ్యాచ్ టికెట్లను శనివారం(మార్చి 10) నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్
అసొసియేషన్ వెల్లడించింది. మార్చి 10 నుంచి పేటీఎం వేదికగా టికెట్లు బుక్
చేసుకోవచ్చని ఏసీఏ సెక్రటరీ ఎస్ గోపినాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 13 నుంచి
ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.ఈ సారి మూడు కేంద్రాల్లో టికెట్ల విక్రయాలు చేపడుతున్నామని, ఎక్కడెక్కడ అనేది
త్వరలోనే తెలియజేస్తామన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000,
రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామని పేర్కొన్నారు.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు బిజీగా ఉండగా.. శుక్రవారం
నుంచి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆఖరి టెస్ట్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో
ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం
చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలనుకుంటుంది. మరోవైపు
ఇండో టెస్ట్ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆసీస్ అదే జోరును కొనసాగిస్తూ
అహ్మదాబాద్‌లో విజయం సాధించి సిరీస్ సమయం చేయాలనుకుంటోంది.
ఈ సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మార్చి 17న ముంబైలోని
వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే జరగనుండగా.. మార్చి 19న వైజాగ్ వేదికగా
రెండో వన్డే, మార్చి 3 చెన్నైలోని చెపాక్ వేదికగా చివరి వన్డే జరగనుంది.
వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వనుండగా..
హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. వైజాగ్ వేదికగా జరిగే రెండో
వన్డేతో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వైజాగ్‌తో రోహిత్ శర్మకు
ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైజాగ్ రోహిత్ శర్మ అమ్మమ్మ ఊరు. దాంతో తన అమ్మగారి
ఊరులో రోహిత్ చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.