గుంటూరు : విశాఖ వేదికగా మార్చి 3, 4న జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్‌కు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
జవహర్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో పాటు విశాఖ సీపీ,
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై
చర్చలు, పెట్టుబడులకు ఒప్పందాలు జరిగే అవకాశముందని వెల్లడించారు. విశాఖ
వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విస్తృతమైన ఏర్పాట్లు
చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం
చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు విశాఖలో సీపీ,
అదేవిధంగా కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ
జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు, డెలిగేట్లకు ఎక్కడా అసౌకర్యం
లేకుండా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు
చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ
శాఖల్లోని పెట్టుబడి అవకాశాలపై చర్చ జరుగుతుందని చీఫ్ సెక్రటరీ స్పష్టం
చేశారు.ఏరో స్పేస్, రక్షణ, వ్యవసాయ, ఆహారశుద్ధి, ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్ ,
వాహనాలు, ఆరోగ్యరంగం, వైద్య పరికరాలు , పెట్రో కెమికల్స్ ఇలా వేర్వేరు రంగాలతో
పాటు వివిధ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చలు చేపట్టినట్టు తెలిపారు.
అదే విధంగా పెట్టుబడులకు సంబంధించిన పలు కీలకమైన ఒప్పందాలు జరగనున్నట్టు చీఫ్
సెక్రటరీ స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు దేశంలోని వివిధ
ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్
ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు సంబంధించి ఈనెల 14వ తేదీన బెంగళూరు , 17వ తేదీన చెన్నై,
20వ తేదీన ముంబై , 24వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించనున్నట్టు
తెలిపారు.