ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
విజయవాడ : తెలుగు సాహిత్య రంగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అందిస్తున్న
సేవలు అపూర్వమని సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు కొనియాడారు. ఆయన గురువారం విశాలాంధ్ర దినపత్రిక కార్యాలయాన్ని,
అనంతరం ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్ హౌస్‌ను సందర్శించారు. ఈసందర్భంగా
విశాలాంధ్ర డీజీఎం టి.మనోహర్ నాయుడు దుశ్శాలువతో కొమ్మినేనిని ఘనంగా
సత్కరించారు. సాహిత్యరంగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అందిస్తున్న సేవలను
గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం
అందించినందుకు గాను కొమ్మినేని కూడా మనోహర్‌నాయుడును దుశ్శాలువతో సత్కరించి
అభినందించారు. విశాలాంధ్ర బుక్ హౌస్‌తో జర్నలిస్టుగా తనకున్న జ్ఞాపకాలను
కొమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ
ప్రముఖుల జీవిత చరిత్రలు, చారిత్రిక నేపధ్య ఘట్టాలకు సంబంధించిన
పుస్తకాలతోపాటు, సామాజిక, తెలుగు బాష, సాహిత్యాభివృద్ధికి అవసరమైన పుస్తకాల
ముద్రణలో విశాలాంధ్ర బుక్ హౌస్ పుస్తకాభిమానులను తొలినుంచి ఆకట్టుకుంటుందని
ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా
రవి, ప్రెస్ అకాడమి కార్యదర్శి బాలగంగాధర తిలక్, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్
ఎడిటర్ కూన అజయ్‌బాబు, ఇన్చార్జి న్యూస్ ఎడిటర్ మోదుమూరి మురళీ కృష్ణ
తదితరులు పాల్గొన్నారు.