విశ్వబ్రాహ్మణ సమస్యలను ముఖ్యమంత్రి దృషికి తీసుకువెళతానని మంత్రి అమర్నాథ్
తెలిపారు. విశాఖపట్నం మింది మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా విశ్వబ్రాహ్మణ
సంఘం మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా న్యాయం
జరిగేటట్లు, పంచ వృత్తుల వారికి ప్రభుత్వం తరఫునుంచి అందాల్సిన సహాయం కొరకు
కృషి చేస్తానన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ నూతన క్యాలెండర్ ను ఐటి శాఖ మంత్రి
అమర్నాధ్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా
అధ్యక్షులు శివకోటి శ్రీనివాసురావు , మహిళా అధ్యక్షురాలు అనుపోజు
సీతామహాలక్ష్మి, కోశాధికారి చంటిబాబు సీనియర్ జర్నలిస్టు కాకమాని వేణు
ఉపాధ్యక్షులు అప్పలరాజు, రాయల లక్ష్మణరావు గుత్తికొండ గంగాధరం, బందర్
శివప్రసాదలు పాల్గొన్నారు.