విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిర్వహించిన స్పోర్ట్స్ & కల్చరల్ మీట్
ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు
సురేష్, పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై. శ్రీ లక్ష్మి కలెక్టర్
ఢిల్లీరావు, పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు
శ్రీ శైలజ, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పలువురు
కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమములో మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ మాట్లాడుతూ
విజయవాడ నగరపాలక సంస్థ వారు మూడు రోజుల పాటు వి.ఎం.సి స్పోర్ట్స్ & కల్చరల్
మీట్ 2023 అట్టహాసంగా ప్రారంభించు కోవటం అభినందనీయమని, క్రీడా స్పూర్తి తో
ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల నడుమ వివిధ రకాల క్రీడల పోటీలను ఏర్పటు చేయుట
పట్ల కమిషనర్ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ప్రతి రోజు విధి నిర్వహణలో ఉన్న
సిబ్బంది ఉత్సాహంగా ఉల్లాసంగా అట పాటలలో వారిలో ఉన్న నైపుణ్యతను వెలికి
తీయుటకు ఇది ఏంతో దోహద పడుతుందని వివరించారు.
పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై. శ్రీ లక్ష్మి, కేవలం నగరపాలక సంస్థ
సిబ్బందియే కాకుండా సచివాలయాల సిబ్బంది, వి.అర్.ఓలు, మహిళా ప్రోటక్షన్
సిబ్బంది నడుమ ఈ క్రీడలు నిర్వహించుట, 40 సంవత్సరాలు పెబడిన వారికీ 40
సంవత్సరాలు లోపు వారికీ విడివిడిగా వివిధ రకాల పోటీలను ఒలoపిక్ క్రీడా పోటీలను
తలపించే విధంగా చర్యలు తీసుకోని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన మున్సిపల్
కమిషనర్ కు ప్రత్యెక అభినందనలు తెలియజేసారు. నగరపాలక సంస్థ మేయర్ రాయన
భాగ్యలక్ష్మి , కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ 18వ తేదిన
క్రికెట్ ఫైనల్, కబడ్డీ, టెన్నీ కాయిట్, వాలీబాల్, త్రోబాల్ వంటి పోటీలతో
పాటుగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రము నందు సాoస్కృతిక
కార్యక్రమములు, జానపద గేయాలు మొదలగు వాటిలో పోటీలు జరగునున్నాయి. అదే విధంగా
19వ తేది ఆదివారం సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ముగింపు
కార్యక్రమము ఏర్పాటు చేసి వివిధ క్రీడలలో గెలుపొందిన వారికీ బహుమతుల
ప్రధానోత్సవ కార్యక్రమము నిర్వహించుట జరుగుతుందని వివరించారు.
కాగా స్త్రీ, పురుషుల 100 మీటర్ల పరుగు పందాలను మంత్రి డా. ఆదిమూలపు సురేష్,
పురపాలక శాఖ కార్యదర్శి శ్రీ లక్ష్మి జెండా ఊపి క్రీడా పోటీలు
ప్రారంభించారు. అనంతరం, వేరు వేరు విభాగాల మధ్య క్రికెట్, ఇతర క్రీడా పోటీలు
జరిగాయి. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది
తదితరులు పాల్గొనగా వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 10 టీమ్
లుగా నిర్వహించిన మ్యాచ్ ఫాస్ట్ ఏంతో ఆకర్షనియంగా నిలిచింది.