సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఇంతియాజ్ కి వినతి పత్రం అందించిన ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్
విజయవాడ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై సీసీఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఇంతియాజ్ కి వినతి పత్రం అందించారు. ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వము త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై అడిషనల్ కమిషనర్ ఇంతియాజ్ మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను సి ఎస్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది, వీఆర్ఏల సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏ ల సమస్యలు, పే స్కేలు లేదా 21 వేతనం ఇవ్వాలని, నామిని, అర్హత మేరకు విఆర్ఓ ప్రమోషన్లు, పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇంతియాజ్ తో మాట్లాడడం జరిగింది. మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చారు. రెవెన్యూ జేఏసీ వి ఎస్ దివాకర్, వెంకటేశ్వరరావు , లక్ష్మీ రెడ్డి, వీఆర్ఏల గ్రామ రెవెన్యూ సహాయకుల సంక్షేమ సంఘo నాయకులు ధైర్యం, సత్య రాజు, ప్రభాకర్ రావు, కేస్ నారాయణ, ఆది వెంకటరమణ, కే శేషయ్య, సామియేలు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు పెద్దన్న, గణేష్, సంగయ్య, తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.