వెలగపూడి : వీఆర్వోల రాష్ట్ర క్యాలెండర్ ను రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి చాంబర్లో రాష్ట్ర రెవిన్యూ మంత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు విఆర్ఓల ఇతర సమస్యలపై చర్చించి వెంటనే వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లులో రేషియో, వన్ టైం సెటిల్మెంట్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కామన్ డిడిఓ ఫైల్ విషయంలో చర్యలు తీసుకోవాలని, సర్వే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన గ్రేడ్ 2 వీఆర్వోల విషయంలో కూడా చర్యలు తీసుకుని అందరికీ ప్రొబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ, వి. ప్రసన్న లక్ష్మీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ అనూష, చైతన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు,ప్రభాకర్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీరామ చంద్ర మూర్తి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షులు, రామ్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు, గురవయ్య పాల్గొన్నారు.