విజయవాడ : వీఆర్వోల సమస్యలపై రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ని ఆయన చాంబర్లో కలిసి విఆర్వోలకు ప్రమోషన్లు వన్ టైం సెటిల్మెంట్ గురించి,
ప్రమోషన్ల రేషియో విషయంపై మాట్లాడారు. మంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం
చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వీఆర్వోల గ్రేడ్ 2 ప్రొబిషన్ కి సంబంధించి
సర్వే సప్లమెంటరీ ఎగ్జామ్స్ వెంటనే నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని
కోరారు. తదుపరి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్
సెక్రటరీ జి. సాయి ప్రసాద్ ని కలిసి ఈ మధ్యకాలంలో వీఆర్వోలు ఎదుర్కొంటున్న
సమస్యలు గురించి, బదిలీల విషయంలో వీఆర్వో లకు, జరిగిన ఇబ్బందుల గురించి
తెలియచేసి, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా స్పష్టమైన ఆదేశాలు అన్ని జిల్లా
కలెక్టర్లకు ఇవ్వాలని కోరారు. అలాగే విఆర్వోల, వీఆర్ఏల సమస్యలపై చీఫ్ సెక్రటరీ
ఇచ్చిన ఆదేశాలపై ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలు
పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు
భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిరియాల లక్ష్మీ నారాయణ,
రాష్ట్ర నాయకులు గోపాలకృష్ణ పాల్గొన్నారు.