కూర్చోలేం, నిలబడలేం.
రాళ్లు ఏర్పడటంతో కిడ్నీ పనితీరు సరిగా ఉండదు. ఇక్కడ చెప్పిన వాటికి దూరంగా
ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్యకు దూరంగా ఉండవచ్చు.ఆర్టిఫిషియల్ స్వీట్ నర్:
చాలా మంది తినే పదార్థాల్లో చక్కెర మోతాదు తగ్గించుకునేందుకు ఆర్టిఫిషియల్
స్వీట్ నరు. ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ కారణంగా కిడ్నీల
పనితీరు చెడిపోతుంది.
రాళ్లు
ఏర్పడటానికి కారణం అవుతుంది.
కెఫిన్:
కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడంతో కాల్షియం స్థాయిలు పెరిగే
అవకాశం ఉంది.
ఇది కిడ్నీలో రాళ్ల సమస్యకు దారితీస్తుంది.
ఉప్ప:
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో
రక్తపోటు పెరుగుతుంది.
ఫలితంగా కాల్షియం స్థాయిలు పెరిగి కిడ్నీలో స్టోన్ ఎక్కువ అవుతాయి.
మాంసం:
మాంసం సైతం కిడ్నీలో రాళ్లు పెరగడానికి కారణం అవుతుంది. మాంసంలో ప్రోటీన్
కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
కార్బోనేటెడ్ డ్రింక్స్:
ఎక్కువగా కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది.
ఇందులో ఉన్న ఫాస్పేట్ కాల్షియం ఆక్సలేట్ స్థాయిలను పెంచుతుంది. దీంతో కిడ్నీలు
సరిగా పని చేయవు.
డెయిరీ ఉత్పత్తులు:
డెయిరీ ఉత్పత్తులలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు బలం
చేకూర్చినప్పటికీ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి.
విటమిన్ సి:
అవసరానికి మించి విటమిన్ సి తీసుకున్నా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచినప్పటికీ అధిక మోతాదులో విటమిన్ సి
ఆక్సలేట్ స్థాయిలు పెంచి కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం అవుతుంది.
స్వీట్ డ్రింక్స్:
అధిక చక్కెర కంటెంట్ కలిగిన డ్రింక్స్ తాగడంతో ఆరోగ్యం చెడిపోతుంది. ఇది
యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.
దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది.