జీర్ణశక్తి బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. పేగుల్లో మంచి
బ్యాక్టీరియాను ప్రోత్సహించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేయడంలో పుట్టగొడుగులు
సహాయపడతాయి. తద్వారా రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గించి డిప్రెషన్ నుంచి
బయటపడేస్తాయి.
2.గింజలు:
అవిసె గింజలు, జనపనార గింజలు, చియా సీడ్స్ వంటి వాటిలో ఒమెగా-3 ఫ్యాటీ
యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపర్చి డిప్రెషన్ ను
నివారిస్తాయి.
3.అవకాడో:
మెదడు పనితీరును మెరుగుపర్చే ఆరోగ్యకర కొవ్వులు అవకాడోలో ఉంటాయి. అలాగే
వీటిలోని విటమిన్లు, ఫైబర్, పోషకాలు ఉల్లాసాన్ని అందిస్తాయి.
4.ఆకుకూరలు:
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ నివారిణిగా ఆకుకూరలు పనిచేస్తాయి.
అలాగే మెదడులో నెలకొన్న గందరగోళాన్ని తరిమేస్తాయి. తద్వారా డిప్రెషన్ నుంచి
కాపాడతాయి.
5.ఉల్లిపాయలు:
ఉల్లిపాయల్లో జీర్ణశక్తిని పెంచి క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడే యాంటీ
ఇంఫ్లమేటరీ లక్షణాలు మెండు. ఇవి మానసిక అనారోగ్య సమస్యలను కూడా పారదోలతాయి.
6.వాల్ నట్స్:
వాల్ నట్స్ లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును
మెరుగుపర్చడంతో పాటు డిప్రెషన్ ని దూరం చేస్తాయి.
7.టొమాటో:
టొమాటోల్లో ఫోలిక్ యాసిడ్, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి
డిప్రెషన్ తో పోరాడటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
8.బీన్స్:
బరువు తగ్గడంలో, డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో బీన్స్ సహాయపడతాయి. అలాగే మంచి
మూడ్ ఇవ్వడంలో దోహదపడతాయి. తద్వారా డిప్రెషన్ తగ్గిస్తాయి.
9.బెర్రీస్:
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీ పండ్లలో
యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్
వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. అలాగే డిప్రెషన్ సంకేతాలను
పారదోలతాయి.