అందించడంతో పాటు డీఎన్ఏ నిర్మాణంలో, కణాలను ఆరోగ్యంగా మార్చడంలో
ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలను దృఢంగా మార్చుతుంది.
* పెరుగు:
పెరుగులో ఫాస్పరస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్ పెరుగులో 245
మిల్లీగ్రామల ఫాస్పరస్ ఉంటుంది. ఇది రోజువారీ ఫాస్పరస్ అవసరంలో 20 శాతంగా
ఉంటుంది.
* సాల్మన్:
సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ లను తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఒమేగా-3
ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇందులో ఫాస్పరస్ కూడా ఎక్కువగానే
ఉంటుంది.
* చీజ్:
చీజ్ లో ఫాస్పరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాలుగా చీజ్ ను ఆహారంలో
భాగం చేసుకోవడంతో శరీరానికి కావాల్సిన ఫాస్పరస్ సులభంగా అందుతుంది.
* చికెన్:
చికెన్ ప్రోటీన్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. చికెన్ లో 182 మిల్లీగ్రాముల
ఫాస్పరస్ లభిస్తుంది. ముఖ్యంగా చికెన్ లివర్ లో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది.
* పప్పు ధాన్యాలు:
పప్పు ధాన్యాలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ప్రోటీన్, ఫాస్పరస్
కంటెంట్ అధికంగా ఉంటుంది. అర కప్పు పప్పు ధాన్యాలు తినడంతో 178 గ్రాముల
ఫాస్పరస్ లభిస్తుంది.
* నట్స్:
నట్స్ తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. బాదం,
జీడిపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది.
* బంగాళదుంపలు:
బంగాళదుంపల్లో ఫాస్పరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక మీడియం సైజు దుంపలో 123
మిల్లీగ్రామలు ఫాస్పరస్ లభిస్తుంది.
* గుడ్లు:
గుడ్లు తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ సులభంగా అందుతాయి. ఒక
గుడ్డు తినడంతో 86 మిల్లీగ్రాముల ఫాస్పరస్ అందుతుంది.