పాల ఉత్పత్తులు:
పాలు, పాల ఉత్పత్తులైన యోగర్ట్, ఛీజ్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కండల
పెరుగుదలతో పాటు కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. మరియు బరువు పెరిగేందుకు
దోహదపడతాయి.
కోడిగుడ్లు:
కోడిగుడ్లలో కండలు పెరిగేందుకు సహాయపడే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వర్కౌట్
చేసిన తర్వాత ఎగ్స్ తింటే కండరాల సమస్య తగ్గడంతో పాటు కండలు పెరుగుతాయి.
చేపలు:
సార్లైన్స్, సాల్మోన్, ట్రౌట్ వంటి కొవ్వు చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్
ఉంటాయి. అలాగే వీటిలోని మంచి కొవ్వులు కండలు పెరగడానికి, కండరాల పాడవ్వడాన్ని
తగ్గిస్తాయి.
పుచ్చకాయ:
పుచ్చకాయ తినడం లేదా దీని జ్యూస్ తాగడం వల్ల కూడా కండరాల డ్యామేజ్ తగ్గుతుంది.
వీటిలోని న్యూట్రియంట్స్ వ్యాయామం తర్వాత బాడీ కోల్పోయిన లవణాల్ని అందిస్తాయి.
దానిమ్మ జ్యూస్:
దానిమ్మలో పాలీఫినాల్స్ వంటి మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే
ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు కండరాల వాపు, నొప్పిని తగ్గిస్తాయి.
కండల్ని పెంచుతాయి.
చెర్రీస్ జ్యూస్:
చెర్రీ పండ్లలో కండల పెరుగుదలకు ఉపయోగపడే పోషకాలు మెండుగా ఉంటాయి. అందువల్ల
వ్యాయామం తర్వాత ఈ జ్యూస్ తాగితే మీకు మంచి శక్తి లభిస్తుంది. కండలు రిలాక్స్
అవుతాయి.
కార్బోహైడ్రేట్స్:
స్టార్చ్ ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా కండల ఆరోగ్యం
మెరుగుపడుతుంది. బంగాళదుంప, చిలగడదుంప వంటివి వర్కౌట్ తర్వాత తింటే కండలు
బలంగా ఉంటాయి.
గింజలు:
బాదం, పిస్తా, జీడిపప్పు వంటి గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా
ఉంటాయి. అలాగే వీటిలో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కండల పెరుగుదలకు
సహాయపడుతుంది.
బీట్ రూట్ జ్యూస్:
బీట్ రూట్ లో బెటాలైన్స్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవి కండలు బలంగా తయారవడానికి
సహాయపడతాయి. అలాగే కండల పెరుగుదలకు తోడ్పడతాయి. అందువల్ల వర్కౌట్ తర్వాత ఈ
జ్యూస్ కూడా తాగవచ్చు.