పోషిస్తుంది. మరి అలాంటి విటమిన్-ఎ అత్యధికంగా ఉన్న డ్రింక్స్ ఇవే…
* క్యారెట్ జ్యూస్:
క్యారెట్లలో బీటా కెరోటిన్ అధిక పాళ్లలో ఉంటుంది. ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ లోని
డైటరీ ఫైబర్లు మలబద్ధకాన్ని నివారించి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి.
* మ్యాంగో జ్యూస్:
మ్యాంగోలో విటమిన్ ఎ అధిక పాళ్లలో ఉంటుంది. ఓ కప్ జ్యూస్లో 112 మైక్రో గ్రాముల
విటమిన్ ఎ ఉంటుంది. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది.
* టొమాటో జ్యూస్:
ముప్పావు కప్పు టొమాటోల్లో దాదాపు 42 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. దీంతో
పాటు టొమాటోల్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది.
* ఆరెంజ్ జ్యూస్:
ఓ గ్లాస్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ లో 2 శాతం వరకు విటమిన్ ఎ ఉంటుంది. అందువల్ల
విటమిన్ ఎ కోసం ఆరెంజ్ జ్యూస్ తాగడం చాలా మంచిది.
* పుచ్చకాయ జ్యూస్:
తాజా పుచ్చకాయ జ్యూస్ లో బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది బాడీలో
విటమిన్ ఎగా మారుతుంది.
* పాలకూర జ్యూస్:
విటమిన్ ఎ అధికంగా ఉన్న ఆహారాల్లో ఆకుకూరలు మొదటి స్థానంలో ఉంటాయి. పాలకూర
జ్యూస్ ఇందుకు ఉదాహరణ. ఇందులో విటమిన్-ఎ తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి.
* పాలు:
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఓ గ్లాస్ పాలలో 112 మైక్రోగ్రాముల విటమిన్ ఎ
ఉంటుంది. ఇందులోని ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం.
* మచ్చ టీ:
ఓ గ్రాము మచ్చ టీ పౌడర్లో యాంటీఆక్సిడెంట్లతో పాటు 50 శాతం వరకు విటమిన్ ఎ
ఉంటుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.