పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి..