వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి గొప్ప నిర్ణయం
సమాజ ప్రగతికి దోహద పడ్డవి వృత్తి కులాలే
వృత్తులను నవీకరించడం, నిపుణత సాధించడం అనివార్యమైనది
వృత్తికారులే ఉత్పత్తికి మూలధారం
అమరావతి : ఏళ్ల తరబడిగా సమాజ అభివృద్ధిలో కీలక భూమిక వహించింది వృత్తి కులాల
వారేనని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఆత్మగౌరానికి
ప్రతీకలుగా నిలిచిన వృత్తిదారుల కుటుంబాలకి రూ.లక్ష చొప్పున ఆర్థిక చేయూత
అందించడానికి ప్రభుత్వం నిర్ణయం ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆయా
వర్గాల కుటుంబాలలో సంతోషాన్ని నింపిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ కు కుమారస్వామి కృతజ్ఞతలు తెలపడం తోపాటు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం
చేశారు. మంగళవారం జాతీయ బీసీ దళ్ నగర బీసీ ప్రతినిధుల మహాసభ జరిగింది.
ప్రధానంగా వృత్తి కులాలకు రూ. ఒక లక్ష ఆర్థిక సహకారం ఇచ్చే నేపథ్యంగా
ప్రభుత్వం ముందుకు రావడం పట్ల సభ ఏకగ్రీవంగా స్వాగతించింది. ఈ కార్యక్రమం నగర
అధ్యక్షుడు టి బాల రాజేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా దుండ్ర
కుమారస్వామి పాల్గొన్నారు.
తొలుత సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మ పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్
చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దుండ్ర
కుమారస్వామి ప్రసంగిస్తూ బీసీ జాబితాలోని రాష్ట్ర ఏ, బి, సి, డి, ఈ గ్రూపులలో
వృత్తి కులాలన్నింటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చేయూతని అందిచాలని కోరారు.
సంచార కులాలను కూడా ప్రత్యేకంగా గుర్తించి వారి ఆర్థిక స్వావలంభనకు చర్యలు
చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకున్నా
సామాజిక న్యాయ ధృక్పథంతో ముందుకు సాగడం ఉన్నతంగా ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని
అభినందిస్తూ ఎక్కడికక్కడ అభినందన సభలు ఏర్పాటు చేయాలని దుండ్ర కుమారస్వామి
కోరారు. మన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటే మేమూ అంతే కృతజ్ఞతగా ఉంటామనే
సందేశాన్ని సమిష్టిగా ఇవ్వాల్సిన బాధ్యత బీసీ సంఘాలు కుల సంఘాలపై ఉందని ఆయన
పేర్కొన్నారు. ఏ పథకాన్ని ఆరంభించినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న సంఘాల
నుండి, నాయకుల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వారు బాగుపడరు,
మరొకరిని బాగు పడనివ్వరు. అలాంటి వ్యక్తులు, వ్యవస్థల పట్ల అప్రమత్తంగా
ఉండాలని దుండ్ర కుమారస్వామి కోరారు. కార్యక్రమంలో బీసీ దళ్ హైదరాబాద్ ఇంచార్జ్
రాజేష్ యాదవ్, బాలకృష్ణ యాదవ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రమణ, సత్యనారాయణ,
ఈసప్ప ఈసప్ప నారాయణరాజు నాగేంద్రప్ప నాగేంద్ర అప్ప, సత్య నారాయణ, లక్ష్మణరావు
సాంబమూర్తి ,పోలయ్య, బ్రహ్మం, శ్రీరంగం రంగ నాయకులు, రామ సుబ్బయ్య, , బాలకృష్ణ
తదితరులు పాల్గొన్నారు.