చంద్రబాబు కరువు కవలపిల్లలు
– గంగ జలాలపై మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల అసత్య ప్రచారం
– గంగనీరు విడుదలైనతర్వాత ధర్నాకు దిగతానడం ఆస్యాస్పదం
– నియోజకవర్గంలో బాలాయపల్లి రోడ్డు ఆల్తురురుపాడు రిజర్వాయర్ అపిన ఘనత ఎమ్మెల్యే ఆనం ది అయితే ప్రతిపక్ష నేతగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల నోరు మెదపరు ఎందుకు
– సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చరిత్రలో జరిగిన విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగినా కళ్ళుండి చూడలేని వారిగా ప్రతిపక్ష నాయకుల వైఖరి
– టిడిపి నాయకులపై నిప్పులు చెరిగిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు . దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉండేవారని , మళ్లీ ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు కరువుతో విలవిల్లాడారన్నారు. టిడిపి పాలనలో 2016 డిసెంబర్లో వెంకటగిరి రైతాంగం గంగ జలాల కోసం పురుగుమందు డబ్బాలతో ధర్నాకు దిగిన సంఘటనలు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల మరిచి నేడు గంగజాలాలు విడుదలైన తరువాత గంగజాలాల కోసం ధర్నా చేస్తానండం హాస్యాస్పదమని విమర్శించారు . తనతోపాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కే సంజీవయ్య గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగ మురళిధర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక టీఎంసీ నీటి విడుదల ఆవశ్యకతను వివరించి కండలేరు జలాశయంలో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉన్న రైతులను ఆదుకునేలా ఆయన్నుంచి నీటి విడుదల చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇప్పించాలని ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలయ్యిందని వివరించారు. నియోజకవర్గ రైతాంగానికి 80,000 ఎకరాలకు పైగా సాగు నీరు అందించే ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులను ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి అడ్డుకున్న సమయంలో ప్రతిపక్ష నేతగా డక్కిలి మండల వాసిగా కురుగొండ్ల ఎందుకు ధర్నా చేయలేక పోయారని ప్రశ్నించారు నియోజకవర్గంలోని వెంకటగిరి – బాలాయపల్లి రోడ్డు పనులను కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డిని ప్రభావితం చేసి పనులను నిలుపుదల తెలిసిన సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఎమ్మెల్యే ఆనం కు ఎందుకు సహకరించారో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగితే సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న అక్కసు తో ఎమ్మెల్యే ఆనం కాంట్రాక్టర్ల ద్వారా పనులు ఆపించారని ఘంటా పదం గా చెప్పగలనని నేదురుమల్లి తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు రూపురేఖలు మారాయని నాడు నేడు ద్వారా పాఠశాలలు కార్పొరేట్ స్థాయి వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయని విద్యా దీపన వసతి దీవన ల ద్వారా నిరుపేదల బిడ్డలు ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే కాక విశ్రాంతి సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం దేశంలో ఎక్కడా లేదని ప్రతిపక్ష నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు ఇక యాత్ర 2 సినిమాలో తనకు కూడా తెలియని ఎన్నో నిజాలను దర్శకుడు చూపించారని ప్రతి ఒక్కరూ ఆ సినిమాను చూసి నిజా నిజాలను గ్రహించాలని తెలిపారు . వెంకటగిరి త్రిభుని సెంటర్ ఎన్ జె ఆర్ సర్కిల్ సమీపంలోని స్థలం వివాదంపై త్వరలో గూడూర్ ఆర్టీవో ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ఏర్పాటుచేసి నిజా నిజాలను స్థానికులకు తెలియజేసేలా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.