ఇంగ్లాండ్ : అసలే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థికమాంద్యంతో అతలాకుతలమవుతున్న
జనజీవనానికి చలి తోడై ఐరోపాను గజగజలాడిస్తోంది. దీంతో ప్రభుత్వాలతో పాటు
స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు వెచ్చటి బ్యాంకులను తెరిచాయి.
ప్రజలు వాటిలో శరణార్థుల్లా తల దాచుకుంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా
నుంచి గ్యాస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐరోపాదేశాలు ముందుగానే చలికాలం
కోసమని భారీగా గ్యాస్ నిల్వలు నింపి పెట్టుకున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత
రాకుండా జాగ్రత్త పడ్డాయి. అయితే ఆ ఏర్పాట్లు ఎంతమేరకు సరిపోతాయోననే సందేహం
మొదలైంది. కారణం ఆరంభంలోనే చలి అదిరిపోతోంది. ఆర్కిటిక్ గాలుల కారణంగా ఉత్తర
ఐరోపాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత
మైనస్ పది డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుందని బ్రిటన్ వాతావరణ శాఖ
హెచ్చరించింది. దాదాపు 30 లక్షల మంది ఈ వాతావరణ పరిస్థితులకు ప్రభావితమవుతారని
అంచనా వేస్తున్నారు. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే తదితర దేశాలతో
పాటు తూర్పు, మధ్య ఐరోపా దేశాల్లోనూ గడ్డకట్టే పరిస్థితి వచ్చేస్తోంది.మునుముందు ఎలా? : శీతాకాలం ఆరంభంలోనే ఇలా ఉంటే మునుముందు ఎలా ఉండబోతోందనే
ఆందోళన వ్యక్తమవుతోంది. ముందస్తు నిల్వలు సరిపోతాయో లేదోననే భయం
ప్రభుత్వంతోపాటు ప్రజల్లోనూ మొదలైంది. దక్షిణ జర్మనీలో పరిస్థితి ఇబ్బందికరంగా
ఉందంటున్నారు. ఫ్రాన్స్‌లో అణు ఇంధన ఉత్పత్తిలో సమస్యలు తలెత్తటంతో మునుముందు
ఇబ్బందులు తప్పకపోవచ్చు. ‘‘ఇప్పటికైతే ఫర్వాలేదు. కానీ వాతావరణం ఇలాగే
గజగజలాడిస్తే, ఉష్ణోగ్రతలు పడిపోతే గ్యాస్ నిల్వలు సరిపోకపోవచ్చు. అప్పుడు
ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన రేషనింగ్ అమలు చేయాల్సిన పరిస్థితి
రావొచ్చు. అప్పుడు పరిశ్రమలకు ఆపి నివాస ప్రాంతాలకు సరఫరా కొనసాగించాల్సి
వస్తుంది’’ అని యూరాసియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అల్కదిరి స్పష్టం
చేశారు. జనవరి, ఫిబ్రవరిల్లో ఇళ్లకు ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటల పాటు ఇంధన
కోతలు తప్పకపోవచ్చని బ్రిటన్ జాతీయ గ్రిడ్ చీఫ్ ఇప్పటికే హెచ్చరించారు.
కార్లు, ఇళ్లను వెచ్చబర్చుకోవటమనేది విలాసంగా మారిందని ఫిన్లాండ్ జాతీయ
గ్రిడ్ నిర్వాహకులు ప్రకటించారు.ఉచితంగా వెచ్చదనం : ఆరునెలల కిందటిదాకా చలిని తప్పించుకోవటానికి ప్రజలంతా
ఒకదగ్గరికి చేరి తలదాచుకోవటం అనేది ఊహించని పరిణామం. కానీ అదిప్పుడు
ఇంగ్లాండ్‌లో నిజమవుతోంది. పెరిగిపోయిన ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో
బ్యాంకులు, లైబ్రరీలు, చర్చిలు, స్వచ్ఛందసంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలు
వెచ్చని బ్యాంకు (వార్మ్ బ్యాంకు)లుగా అవతారమెత్తి ప్రజలకు ఉచితంగా
సేవలందిస్తున్నాయి. ఇంట్లో ఇంధన సమస్య ఉన్నవారు, ఇంధనాన్ని పొదుపుగా
వాడుకోవాలనుకుంటున్నవారు వేలమంది శరణార్థుల్లా ఈ బ్యాంకులకు వచ్చి
గడుపుతున్నారు. ఈ బ్యాంకుల్లో ఉష్ణోగ్రతలను 21 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద
ఉంచటమేగాకుండా వచ్చినవారికి వేడివేడి తేనీరు అందిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి
మునుముందు థియేటర్లు, మ్యూజియాలు, రెస్టారెంట్లను కూడా వెచ్చటి బ్యాంకులుగా
మార్చాలనుకుంటున్నారు. దాతృత్వం సంగతి ఎలా ఉన్నా దేశ సామాజిక, ఆర్థిక
పరిస్థితులకు ఇది అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.