తానేటి వనిత
కొవ్వూరు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో వినూత్న సంస్కరణలు
తీసుకొచ్చి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర
హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు.
కొవ్వూరు టౌన్ లోని స్థానిక మూర్తి రాజు స్కూల్ (పండిత మదన మోహన మాలవ్య
మున్సిపల్ హైస్కూల్) లో నిర్వహించిన ‘జగనన్న ఆణిముత్యాలు’ కొవ్వూరు నియోజకవర్గ
స్థాయి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ
కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో చదివి పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో
అత్యధిక మార్కులు సాధించి కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో టాపర్స్ గా నిలిచిన
విద్యార్థులకు నగదు ప్రోత్సాహం, మెడల్, సర్టిఫికేట్, మెమోంటోలను అందించారు.
తల్లిదండ్రులను, స్కూల్ ప్రధానోపాధ్యాయులను శాలువాతో హోంమంత్రి సత్కరించారు. ఈ
సందర్భంగా 10వ తరగతి విద్యార్థిని షేక్ మరియం సలేహా జగనన్న ప్రభుత్వంలో జరిగిన
విద్యా సంస్కరణలపై ఇంగ్లీష్ లో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. హోంమంత్రి
ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు.
జగనన్న విద్యా కానుక కింద ఉచితంగా పాఠ్యపుస్తకాలను, నోటుబుక్కులను, బ్యాగులు,
యూనిఫామ్ అందచేస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద చదువుకున్న విద్యార్థి తల్లి
ఖాతాలో రూ 15 వేలు జమ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న నాడు నేడు పథకం కింద
ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూల్ కు దీటుగా అభివృద్ధి చేయడం
జరిగిందన్నారు. విద్యాభివృద్ధి కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇలా అనేక సంస్కరణలతో విద్యారంగంలో రాష్ట్ర
ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న మార్పులు కారణంగా ఈ రోజున పిల్లలందరూ కూడా
గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
గతంలో గవర్నమెంట్ స్కూల్ కి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఇష్టపడే వారు
కాదని ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం కాన్వెంట్ లకు పంపించే వారని తెలిపారు..
కానీ ఇఫ్పుడు ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్
నాడు-నేడు కార్యక్రమం ద్వారా తీర్చిదిద్ది ప్రభుత్వ బడుల్లో సీట్లు ఖాళీ లేవు
అనే స్థితికి తీసుకొచ్చిన సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థ
నిర్యూలన దిశగా విద్యా రంగంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు.
పిల్లలందరూ పౌషికాహారంతో ఆరోగ్యంగా, బలంగా ఉండాలనే సంకల్పంతో గోరు ముద్ద
ద్వారా రుచికరమైన, పౌష్టిక ఆహారం అందజేస్తున్నామన్నారు. చిన్నారులు,
విద్యార్థుల కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదన్నారు. విద్యార్థులను,
వారి తల్లిదండ్రులను ప్రొత్సహించే విధంగా ఈ రోజు కార్యక్రమం తీర్చిదిద్దడం
అభినందనీయం అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని బలంగా
నమ్మిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చే దిశగా తల్లిదండ్రులను తమ
పిల్లలను ప్రోత్సహించాలని హోంమంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.
బహుమతులు అందుకున్న విద్యార్థుల వివరాలు
పదవ తరగతి విద్యార్థులైన గునపరెడ్డి సత్య అనూష దుర్గ (జెడ్పీపీ హైస్కూల్,
వాడపల్లి, కొవ్వూరు మండలం) రూ.15 వేల నగదు ప్రొత్సాహం, కనమట అనిల్ కుమార్
(ఎస్పీపీఆర్ఆర్ జెడ్పీపీ హైస్కూల్, తాళ్లపూడి) రూ.10 వేల నగదు ప్రొత్సాహం,
దూసనపూడి తేజస్విని లలిత (జెడ్పీపీ హైస్కూల్, వాడపల్లి, కొవ్వూరు మండలం) 5 వేల
నగదు ప్రొత్సాహం అందుకున్నారు. ఇంటర్ విద్యార్థులైన పి. హరిత
(ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజీ, కొవ్వూరు), పిట్ల గాయత్రి (గవర్నమెంట్
జూనియర్ కాలేజీ (బాయ్స్), కొవ్వూరు), పొడపాటి వీర వెంకట సత్యనారాయణ
(గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, వేగేశ్వరపురం), బోత్స వీర వెంకట సత్య వాసంతి
(గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, చాగల్లు) విద్యార్థులు వరుసగా ఎంపీసీ, బైసీపీ,
హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచి ఒక్కొక్కరు 15 వేల చొప్పున
నగదు పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,
నాయకులు, విద్యాధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ ఎత్తున
పాల్గొన్నారు.