విజయవాడ : జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు,
నవలా రచయిత డా.ప్రభాకర్ జైనీ తన తండ్రి పేరుతో ఇస్తున్న ‘లక్ష్మీనారాయణ జైనీ
జాతీయ పురస్కారం’ ఈ సంవత్సరం ‘స్వాతి’ సంస్థల అధినేత వేమూరి బలరామ్ రాసిన
‘స్వాతి చినుకులు’ గ్రంథానికి ఇస్తున్నారు. ఈ పురస్కార సభ మార్చి 30న గురువారం
సాయంత్రం విజయవాడ, గాంధీనగర్ లోని హోటల్ ఐలాపురం ఏసీ ఆడిటోరియంలో జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు. ఈ
పురస్కారానికి లక్ష రూపాయల నగదుతో రచయితను ఘనంగా సత్కరిస్తారు. ఇదే వేదికపై
విజయలక్ష్మీ జైనీ నిర్మాతగా, డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో
రూపొందించనున్న ‘స్వాతి బలరామ్… అతడే ఒక సైన్యం’ బలరామ్ గారి బయోపిక్ చిత్రం
షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆడియో సీడీని సి.సి.ఎల్ఎ అడిషనల్
కమిషనర్ ఎఎండి ఇంతియాజ్ ఆవిష్కరిస్తారని , పురస్కార కమిటీ కన్వీనర్ కలిమిశ్రీ
తెలిపారు.