గుంటూరు : ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కి 175
సీట్లు గెలుచుకునే వాతావరణం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో సజ్జల
టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెలేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు,
జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.
‘రాష్ట్రంలో వైఎస్సార్సీపీ 175కి 175 స్దానాలు గెలుచుకునే వాతావరణం ఉంది.
ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. దొంగఓట్ల
తొలగింపు,అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుకుగా ఉండాలి. అసైన్డ్
భూములు, చుక్కల భూములు విషయంలో ప్రభుత్వం తీసుకున్న మేలు ప్రజల్లోకి
తీసుకువెళ్ళాలి. 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీకి ప్రతిరోజు
కీలకమే. పార్టీ పరిశీలకులు ఎంఎల్ఏలకు, కోఆర్డినేటర్లకు సంధానకర్తలుగా
క్రియాశీలకంగా వ్యవహరించాలి. వాలంటీర్లను ఢీఫేమ్ చేయాలని, టెర్రరైజ్ చేయాలని
ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న
విద్వేష, విషపూరిత ప్రచారాన్ని తిప్పికొట్టాలని సజ్జల పేర్కొన్నారు.