పురస్కారాలకు దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ ఆగష్టు 31
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల తరహాలోనే వైఎస్సార్ అవార్డుల ప్రదానం
దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, సంస్థలు నామినేషన్లు పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ
secypolitical@ap.gov.in
వైఎస్సార్ అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ
కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత
పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగష్టు 31 న ముగియనుందని
హైపవర్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్
తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజా సేవలో ప్రతిభ కనబరిచిన
వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలకు గుర్తింపుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్
మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తోందని
తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను అందజేస్తోందన్నారు. దరఖాస్తు చేసుకునే
వ్యక్తులు, సంస్థలు తమ విజయాలు, సేవలు గురించి ఒక పేజీకి మించకుండా
సమాచారాన్ని అందించాలని, వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు
పొందుపరచాలని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్స్ పై ఎలాంటి పరిమితిలేనందున పైన
పేర్కొన్న రంగాల్లో ఎన్ని ఎంట్రీలైనా నమోదు చేసుకోవచ్చని, నామినేషన్లు
స్వీకరించడానికి చివరి తేదీ 31 ఆగష్టు, 2023 అని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు
చేసుకునే వ్యక్తులు, సంస్థలు తమ నామినేషన్లను secy-political@ap.gov.in మెయిల్
ఐడీకి కూడా పంపవచ్చని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి దరఖాస్తులను పంపించేలా
శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నామినేషన్లకు అర్హులు : కళలు, సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్
ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్,
సివిల్ సర్వీస్, స్పోర్ట్స్ తదితర రంగాల్లో (పైన పేర్కొన్న రంగాలు కాకుండా ఇతర
రంగాలు) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు. పైన పేర్కొన్న
రంగాల్లో గ్రామాల్లో, మురికివాడల్లో పనిచేస్తూ సరైన గుర్తింపు పొందని
రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. పొలిటికల్ ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు.
చరిత్రలో పేరుగాంచిన సంస్థలు సంఘాలు.