ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు. 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు.
సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్‌ను కట్ చేయనున్నారు.