శ్రీకాకుళం : నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల
ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేసే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా
అంబేద్కర్ ఆడిటోరియం నుంచి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్.
రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365
మంది అక్క చెల్లెమ్మలు
బ్యాంకులకు రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు
ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి. వైఎస్సార్ సున్నావడ్డీ పథకంలో ఇప్పటివరకు
అందించిన మొత్తం రూ.4,969.05 కోట్లు అవుతుంది. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్
శ్రీకేశ్ లటకర్, జాయింట్ కలెక్టర్ నవీన్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు
కృష్ణమూర్తి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, పొందర
కూరాకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ రాజాపూ హైమావతి, డిఆర్డిఏ పిడి విద్యాసాగర్
తదితరులు పాల్గొన్నారు.