డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి:15 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మరియు బీసీలకు జనాభా ప్రాతిపదికన పదవులలో అవకాశం కల్పించారని, ఏ ప్రభుత్వంలో చేయనివిధంగా ఉపముఖ్యమంత్రి, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను మా బిసి దామాషా ప్రకారం ఇచ్చినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి అని డక్కిలి మండల వైకాపా పార్టీ చెందిన బీసీ నాయకులు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు, కులవృత్తులకు పరిమితం చేశారని, జగన్ మోహన్ రెడ్డి బీసీల సంక్షేమం అభివృద్ధి అధికారం అనే లక్ష్యంతో ఉన్నారని ఈసారి కూడా రాబోవు సార్వత్రిక ఎన్నికలలో బీసీలు ఓట్లు జగనన్నకే వేస్తామన్నారు ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ఉపాధ్యక్షులు దాసరి. పోలయ్య, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వెలికంటి చెంచయ్య, డి వడ్డిపల్లి ఎంపీటీసీ చెంచయ్య, పులకంటి రామారావు,ఒలిపి ఆంజనేయులు,కె వేణు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.