చికిత్స కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అవసరమైతే ముంబయి
తరలించేందుకు స్టీల్ ప్లాంట్ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సీఎండీ అతుల్‌భట్, డైరెక్టర్ మొహంతి ఆసుపత్రిలో పరామర్శించి బాధిత
కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.కార్మికలోకం శనివారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని
రీతిలో ఉపద్రవం విరుచుకు పడటంతో కలకలం రేగింది. ఉక్కు ఎస్ఎంఎస్-2 (స్టీల్
మెల్టింగ్ షాపు) విభాగంలో ‘కన్వర్టర్-ఈ’ వద్ద ద్రవ ఉక్కు పాత్ర (స్లాగ్
పాట్) తరలించే ట్రాక్‌పై వ్యర్థాల తెట్టు పడిపోవడంతో అది ముందుకు కదలక
ఆగిపోయింది. సాధారణంగా తెట్టు చల్లారిన తరువాత తీస్తారు. అయితే వెంటనే
ట్రాక్‌ను సరిదిద్దే పని ఆరంభించే సమయంలో స్లాగ్‌పాట్ పేలి ద్రవ ఉక్కు
కార్మికులు, అక్కడున్న పర్యవేక్షణ అధికారులపై పడ్డాయి. ఈ ఘటనలో 10 మంది
గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి యాజమాన్య
నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ‘యాంత్రీకరణతో
సాగాల్సిన పనులు ఉద్యోగులతో చేయిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాల తీవ్రత
పెరుగుతోందని మండిపడుతున్నారు. క్షత గాత్రులను ఉక్కు సీఎండీ అతుల్‌భట్,
డైరెక్టర్ మొహంతి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా
అండగా ఉంటామన్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శ : ఉక్కు పరిశ్రమలో గాయపడిన క్షతగాత్రులను
మంత్రి అమర్నాథ్ రామ్ నగర్ సెవెన్హీల్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదం
జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను
సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని
తెలిపారు. ఇద్దరికి 50 నుంచి 65 శాతం వరకు, మిగిలిన వారికి 20 నుంచి 25 శాతం
వరకు కాలిన గాయాలయ్యాయని తెలిపారు. వైద్యం విషయంలో కాంట్రాక్టా, శాశ్వత
ఉద్యోగులా అనే తారతమ్యత లేకుండా చూడాలని ఉక్కు అధికారులకు సూచించారు. అవసరమైతే
మరింత మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబయి తరలించేందుకు సిద్ధంగా
ఉండాలని, వైద్యం విషయంలో రాజీపడే అవకాశం లేదన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగి
రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నాయకులు ఉన్నారు.