విశాఖపట్నం : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని విశాఖలో ఉత్తరాంధ్ర
జిల్లాల ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో
త్వరలో ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 104
వాహనాల ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందించనున్నట్టు తెలిపారు. వైద్య
శాఖలో 47 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతం చింతూరులో 26
మంది సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిపినట్టు మంత్రి వివరించారు. తన
పర్యటనలో భాగంగా విడదల రజని విజయనగరంలో మెడికల్ కాలేజి నిర్మాణాన్ని
పరిశీలించారు. పనుల తీరు, నిర్మాణ సామగ్రిపై ఆమె అధికారులను అడిగి వివరాలు
తెలుసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ, విజయనగరంలో రూ.500 కోట్లతో వైద్య
కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు
ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.