యాదాద్రి : యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్థిక, వైద్యారోగ్య
మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల
లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, నల్గొండ
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ సందీప్
రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం యాదగిరి గుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ ముఖ్య
కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ లక్ష్మి నరసింహ స్వామీ
దర్శనం చేసుకొని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమిపూజ చేసుకోవడం సంతోషంగా
ఉంది. జన్మదినం సందర్బంగా, సీఎం కేసీఆర్ కానుక ఒక రోజు ముందుగానే మీకు
అందింది.
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానం లోవుంది. ఉత్తప్రదేశ్ చివరి
స్థానంలో ఉంది అక్కడి నుండి మహేంద్ర పాండే అనే మంత్రి వచ్చి ఇక్కడ విమర్శలు
చేస్తరు. ముందు మీ ఉత్తర్ ప్రదేశ్ లో మంచిగా చేసుకో. అక్కడ వైద్య పరిస్థితులు
దారుణంగా ఉన్నాయి. నల్గొండలో, సూర్యాపేట లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం.
యాదాద్రి భువనగిరిలో త్వరలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం.
ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే, మాకు కార్యకర్తలు ఎట్లా అంటడు.
మీది కుట్ర కాదా. నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నడు.
కడుపులో ఉన్నదాన్ని బయటికి కక్కిండు. ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వానిది
కుట్ర అవుతుందా, ఉద్యోగాలు ఇస్తే ఏడ్చే బండి సంజయ్ ది కుట్ర అవుతుందా.
నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే మీ కుట్ర. కొత్త
ఉద్యోగాల కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. ప్రజలకు పేల్చిటోడు
కూల్చిటోడు కావాలా. నిర్మించేటోడు కావాలి, పునాదులు తవ్వేటోడు కావాలన్నారు.
బిడ్డా… ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు గల్లంత
చేస్తరు.
ఏం చెప్పాలో దిక్కులేక, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల
నోటిఫికేషన్లు ఇస్తే ఒకడు కుట్ర అంటడు, అంబేడ్కర్ పేరు మీద సచివాలయం
నిర్మిస్తే ఇంకొకడు కూలుస్తం అంటడు. మా నాయకుడు ఏ పని చేసినా ప్రజల కోసం
చేసిండు. ఎన్నికల హామీ ఇవ్వకున్నా కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, రైతు బంధు,
రైతు బీమా ప్రజల కోసం హామీ ఇవ్వకున్నా నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ ది.
యాదాద్రి గుడి కట్టాము ఒట్లప్పుడు చెప్పామా లేక, ఎన్నికల ముందు ఓపెనింగ్
చేశామా. ఊహించని విధంగా, భూలోక వైకుంఠం గా దేవాలయం నిర్మించారు. ఎన్నికల కోసం
లాభం అవుతుందని చేశారా.