బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
పేద విద్యార్థులకు వెలలేని సేవలు అందించి నందుకు డివిజన్ స్థాయిలో ఉత్తమ మండల విద్యాశాఖాధికారి అవార్డు గ్రహీత మండల విద్యాశాఖ అధికారి ప్రతాప్ కుమార్ ని,ఉత్తమ డేటా ఎంట్రీ ఆపరేటర్ బాబురావు ని శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ఈసందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉపాధ్యొయునిగా వెలలేని సేవలందించారని తెలిపారు.వారు సేవలు ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు,స్వర్ణంధ్రాభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ జంపు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
పోటో:-సన్మానం చేస్తున్న దృశ్యం