తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం
చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం 6 గంటలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ
గోవిందరాజస్వామి, చక్రత్తాళ్వార్ ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి
కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర
హారతులు సమర్పించారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం
నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్.తోటకు
వేంచేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి పి.ఆర్.తోట నుండి ఊరేగింపుగా బయల్దేరి
శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల
వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు
దర్శనమిస్తారు. రాత్రి 8.40 గంటల నుండి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ
కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, కంకణభట్టార్ ఏపి శ్రీనివాస దీక్షితులు,
డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్ మోహన్ రావు,
టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.