విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నకు
ఉపాలయమైన సీతానగరం, తాడేపల్లి(మ) లోని శ్రీ సీతాసమేత కోదండరామ స్వామి వార్ల
దేవస్థానం లో (చైత్ర శుద్ధ నవమి), శ్రీరామనవమి సందర్భంగా వేదపండితుల
వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యముల నడుమ ఆలయ అర్చకులచే శ్రీ సీతా రాముల వారి
కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము
నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు,
కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, సీతా డైరెక్టర్ డి. రామచంద్ర రావు ,
ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం నకు భక్తులు
విశేషముగా విచ్చేసి, భక్తి శ్రద్ధలతో కళ్యాణమును తిలకించారు. కళ్యాణం అనంతరం
దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు
చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి, సిటా డైరెక్టర్ పాల్గొని భక్తులకు స్వయముగా
వడ్డించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదమును స్వీకరించారు.