కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
మండలం రాజుపాలెం సమీపంలో ని పరమానంద ఆశ్రమంలో లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో గోదారంగ నాద కళ్యాణం వైభవంగా నిర్వహించారు, ముందుగా విగ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవముగా కళ్యాణం నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా రాజుపాలెం గ్రామానికి చెందిన ముప్పాళ్ళ వెంకటేశ్వర్లు, సిందూర, ముప్పాళ్ళ రమేష్,అనిత, దంపతులు వ్యవహరించారు, మాజీ యం యల్ సి మాదాసు గంగాధరం లక్ష్మీ నృసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమం లో అర్చకులు రామాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.