పూర్ణాహుతి లో పాల్గొన్న సీఎం జగన్
విశేష పూజలు జరిపించిన స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి
శారదా పీఠం లో సాంప్రదాయ బద్దంగా పూజలు
విశాఖ శారదా పీఠం లో శ్రీ రాజశ్యామల యాగం వైభవోపేతంగా జరిగింది . బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయం జ్యోతి మండపం లో రాజ శ్యామల అమ్మవారి యాగం లో పాల్గొన్న సీఎం జగన్ తో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పూర్ణాహుతి జరిపించారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. తాడేపల్లి నుండి విశాఖపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా శారదా పీఠం చేరుకున్నారు. మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని సంకల్పం చెప్పుకొన్నారు. తొలుత మహాస్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనంతరం రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో రాజ్యశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ : సాంప్రదాయ దుస్తుల్లో అక్కడి దేవతామూర్తులను దర్శించుకొని, యాగంలో పాల్గొన్నారు. పీఠం ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించారు.పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సారథ్యంలో వేదపండితులు, ప్రధాన అర్చకులు సమక్షంలో పూజా క్రతువులు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన యాగం,ఈ పూజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య మంత్రి జగన్ తో పాటు రాజ్య సభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ, బి.వి. సత్యవతి, గొడ్డేటి మాధవి, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జెడ్ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లీ , అదీప్ రాజ్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు,జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్. రవి పట్టన్ శెట్టి, పోలీస్ కమిషనర్ డా. ఎ. రవిశంకర్, జాయింట్ పోలీస్ కమిషనర్ డా.కె. ఫక్కీరప్ప, జీవీఎంసీ కమిషనర్ సీఎం. సాయికాంత్ వర్మ, అడిషనల్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ లు పీఠంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దేశంలోనే ఏకైక పీఠం శారదా పీఠం : స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
దేశంలోనే రాజశ్యామల యాగం సాంప్రదాయ బద్ధంగా జరిపించే ఏకైక పీఠం విశాఖ శ్రీశారదా పీఠమని
పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ ఉత్తరాఖండ్ దళిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇక్కడ రాజ్యశ్యామల యాగంలో పాల్గొన్న వారేనని గుర్తు చేశారు. విశాఖ శారదాపీఠంలో కొలువైన రాజశ్యామల మాత అత్యంత శక్తివంతమైన మాతగా అభివర్ణించారు. నిత్య ధూప దీప నైవేద్యాలతో, త్రికాలర్చన, నివేదనాలతో ఉపాసన దేవతగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనటం, రాజశ్యామల యాగం చేయటం ఆనవాయితీగా వస్తున్నదనీ చెప్పారు. రాజ్యశ్యామల యాగం బుధవారం అద్భుతంగా జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఆశీస్సులు అందజేశారు.