అధ్యక్షులు జూపూడి ప్రభాకర్,గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య
వరప్రసాద్, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి మాజి ఉపప్రధాని డాక్టర్.బాబు
జగ్జీవన్ రామ్ చేసిన కృషి అందరికి మార్గదర్శకమని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి
కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం
నాడు ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నందిగమ్ సురేష్
తోపాటు ఎస్సిసెల్ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు జూపూడి ప్రభాకర్,పార్టీ గుంటూరు
జిల్లా అధ్యక్షులు డొక్కామాణిక్యవరప్రసాద్,శాసనమండలి సభ్యులు లేళ్ళ
అప్పిరెడ్డి, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకరావు మాదిగ, ఆప్కో
ఛైర్మన్ గంజి చిరంజీవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా నందిగమ్ సురేష్ మాట్లాడుతూ జగ్జీవన్ ఆశయాలను వైయస్ఆర్ కాంగ్రెస్
పార్టీ ముందుకు తీసుకెళ్తుందని నందిగం సురేష్ అన్నారు. స్వతంత్ర సమరయోధులైన
ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైయస్సార్ సిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్
మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు
రిజర్వేషన్లు, వెనకబడిన వర్గాలకు,మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం
ఇచ్చారన్నారు. పేదవర్గాలు బాగుండాలనే ఉధ్దేశ్యంతో అనేక సంక్షేమ
పధకాలు,విద్య,వైద్యం అందుబాటులోకి తెచ్చారన్నారు. పేదవిద్యార్దులకు ఇంగ్లీషు
మీడియం ప్రవేశపెట్టారన్నారు.అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు
వెళ్తున్నారన్నారు.రానున్న ఎన్నికలలో తిరిగి జగన్ ని ముఖ్యమంత్రిని
చేసేవిధంగా అందరూ అండగా నిలవాలని కోరారు.
జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ తాను స్వీకరించిన పదవులకు వన్నె
తెచ్చారన్నారు. తాను చేపట్టిన పలు పోర్టు ఫోలియోల ద్వారా తన అనుభవాన్ని
రంగరించి దళితులను ఉన్నతస్ధానాలకు తేగలిగాలన్నారు. మంచి పరిపాలనా దక్షుడిగా
పేరుపొందారన్నారు. అంబేద్కర్,జగ్జీవన్ రామ్,జ్యోతిరావుపూలేల బాటలో నడుస్తున్న
వ్యక్తి శ్రీ వైయస్ జగన్ అని అన్నారు. తాను చేసిన పాదయాత్రలో అణగారిన వర్గాల
బాధలను గ్రహించి వారిని అభివృధ్దిలోకి తీసుకువచ్చేందుకు వైయస్ జగన్ అనేక మంచి
పధకాలు ప్రవేశపెట్టి జగ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని
తెలియచేశారు.జగన్ ఆలోచన విప్లవాత్మక ధోరణిలో ఉందన్నారు.పవన్ కల్యాణ్ జగన్ ని
విమర్శించేముందు అన్ని విషయాలపై అవగాహన పెంచుకుని మాట్లాడాలని హితవు చెప్పారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరికో
స్పూర్తిని ఇచ్చిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు.రైతాంగ సమస్యలపై ఎవరైనా
ప్రస్తావిస్తే స్వామినాధన్ పేరు చెబుతారని అన్నారు.అలాంటి స్వామినాధన్ ను
గుర్తించి ప్రోత్సహించిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు.రైతుకూలీల
సమస్యలను పరిష్కరించిన వ్యక్తి అన్నారు.రైతుకూలీల సమస్యలంటే కమ్యూనిస్టులు
గుర్తుకువస్తారని అియితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రైతుకూలీల సమస్యలకోసం పోరాటం
చేశారన్నారు.భారతదేశ నిర్మాణంలో జగ్జీవన్ పాత్ర విడదీయలేనిదని అన్నారు.ఆయన
విధానాలను ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. లేళ్ళ
అప్పిరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించడమే కాకుండా
దేశ అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా చేయడంలో జగ్జీవన రామ్ ఆదర్శవంతమైన పాత్ర
పోషించారన్నారు. వైయస్ జగన్ జగ్జీవన్ రామ్ చూపిన బాటలో ముందుకు
వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్స్,
వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.