ప్రజాశక్తి వెంకటగిరి రూరల్ : తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని విశ్వనాధపురం ఎస్టి కాలనీలో ఈగ రాజేశ్వరమ్మ మరణించింది ఆమె ఆత్మశాంతించాలని, కుటుంబ సభ్యులకు వైయస్సార్ బీమా పథకం ద్వారా పదివేల రూపాయలు అందజేశారు. ఈగ రాజేశ్వరమ్మ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యుల కు వైసిపి నాయకుడు సదానంద రెడ్డి చేతుల మీదుగా మట్టి ఖర్చులు గాను పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. బీమా మొత్తం రెండు లక్షల రూపాయలు ఈనెలకు లాగా అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఆ గ్రామం ప్రజలు వాలంటీర్ పుష్ప పాల్గొన్నారు