సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీని తీర్చిదిద్దే ప్రయత్నం
మైనారిటీలను అన్ని విధాలా అభివృద్దిలోకి తీసుకుచ్చేందుకు కృషి
చంద్రబాబు జనసేన, బిజేపి అందరూ కలిసినా వైయస్సార్సిపి ఘన విజయం ఖాయం
వైయస్సార్ సిపి మైనారీటి సెల్ కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు : వైయస్సార్ సిపి డిఎన్ ఏలోనే మైనారిటీలు ఉన్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.మైనారిటీలను అన్ని విధాలుగా అబివృద్దిలోకి తీసుకువచ్చేందుకు వారి కాళ్లపై వారు నిలబడి అందరికి నాయకత్వం వహించేలా చేసేందుకు జగన్ గారు చేస్తున్న కృషిని మైనారీటీ నేతలంతా ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్సార్ సిపి మైనారీటి సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. సమావేశానికి మైనారీటి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ భాషా అద్యక్షత వహించారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ సిపి పాలనలో రాష్ట్రంలో కోటి 47 లక్షల కుటుంబాలు 57 నెలలుగా ఏదో ఒక రకంగా లబ్దిపొందాయి. నగదు,ఇతర ప్రయోజనాల రూపంలో ఇది జరిగింది. ఇందులో అత్యధికంగా ఎస్సిఎస్టి,బిసి మైనారిటీ కుటుంబాలు. ఈ వర్గాలనుంచే మన పార్టీ పుట్టుకు వచ్చింది. అందుకే వారు పార్టీ డిఎన్ ఏలో పార్ట్. ఎస్సీ, ఎస్టి, బిసి మైనారీటీలు అందుకు తగినట్లుగానే మన విధానాలు ఉన్నాయి. ఈ వర్గాలు ఉన్నతస్దాయికి రావాలనే లక్ష్యం దిశగా వైయస్ జగన్ పని చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం మరో ఐదు సంవత్సరాలు ఉంటే ప్రభుత్వం పాలనలో బంగారు భవిష్యత్తు ఇవ్వగలం అని, 175 కి 175 గెలవాలని జగన్ కోరుకుంటున్నారు. అంతే విశ్వాసంతో పార్టీ నేతలు కార్యకర్తలు ముందుకు వెళ్లగలుగుతున్నారు. ప్రజలు కూడా వైయస్సార్ సిపికి తమను ఓట్లు అడగడానికి పూర్తి అర్హత ఉందని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. కార్యకర్తలందరూ ఎంత ఉత్సాహాంగా ఉన్నారు. సునామీలా వస్తున్న ఈ ఆదరణను ఛానలైజ్ చేసి పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఫ్యాన్ పై రెండు బటన్లు నొక్కేలా చేయాలి. ఇదే మన అందరి టార్గెట్ అన్నారు. టార్గెట్ క్లియర్ గా ఉంది. మార్గం కూడా వేసి ఉంది. పరీక్షలు దగ్గర పడ్డప్పడు ఎలా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా అందరూ ప్రిపేర్ కావాలి. ముఖ్యమంత్రిగారు అన్నట్లు తాను 125 బటన్లు నొక్కాను. మీరు రెండు బటన్లు నొక్కితే చాలని అంటున్నారు. అదే ప్రతి ఒక్కరూ చేయాలని కోరారు. ఒకటి అసెంబ్లీకి మరొకటి పార్లమెంట్ కు అని అన్నారు. పార్టీ కార్యకర్తలు జగన్ పధకాలను ప్రజలలోకి తీసుకువెళ్లారు. కులం, ప్రాంతం, పార్టీలు బేధాలు లేకుండా అందరికి లబ్ది చేకూర్చాం. వివక్షకు తావు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం ఇలా చేసి ఉండదు. ఇంతలా సాహసం కూడా చేసి ఉండదని చెబుతున్నాను. చేతిలో ఉన్న అధికారం క్యాడర్ వదలేశారు. 2014-19 మధ్య జన్మభూీమి కమిటీల మాదిరిగా అరాచకాలు చేయలేదు. వారిలా మాఫియాలా ప్రవర్తించలేదు. వైయస్సార్ సిపి అధికారంలోకి రాగానే చాలామంది అదే విధంగా కాకపోయినా అధికారం అనుభవించవచ్చని భావించారు. కాని జగన్ ప్రజలు ఏది కోరుకున్నారో ఆ విధంగా అవినీతికి, వివక్షతకు తావులేకుండా చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అవినీతికి వివక్షతకు, తావులేకుండా పారదర్శకంగా పరిపాలన అందించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్లారు. అలా చేసినప్పుడే ప్రజల ఆదరణ ఉంటుంది. శాశ్వతంగా ప్రజల మనస్సులో చెరగని ముద్రవేస్తామని భావిస్తారన్నారు. అలా చేసినప్పుడే ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రజల వద్దకు ముందుకు వెళ్ళ గలగుతారని అన్నారు. అధికారం అంటే భాద్యతగా ఫీలవ్వాలనేది జగన్ నమ్మారు. అదే రాజకీయపార్టీగా ప్రజలలో శాశ్వత గుర్తింపు తెస్తుందని తెలిపారు. వైయస్సార్ సిపి నామినేటెడ్ పదవులలో కూడా మైనారీటిలకు జగన్ పెద్దపీట వేశారు. డిప్యూటి సిఎం, మండలి డిప్యూటి ఛైర్సపర్సన్ దగ్గర్నుంచి శాసనమండలిలో సభ్యులుగాను, వార్డు మెంబర్లు, మండల, పట్టణ, నగరస్దాయిలలో కేవలం మైనారీటీల ప్రతినిధులగానే కాక కొన్ని వర్గాల ప్రతినిధులుగా గతంలో క్రియేట్ చేసేవారు. కాని జగన్ మైనారీటీలు అన్ని వర్గాల ప్రతినిధులుగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్నారన్నారు. మైనారీటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. నామినేటెడ్ పదవులలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారీటి,మహిళలకు 50 శాతం తప్పనిసరిగా జగన్ గారు అమలు చేస్తున్నారు. కొన్ని కులాల్లో పదవులు ఉన్నా కూడా వారిలో నాయకులను వెదకాల్సిన పరిస్దితి వచ్చింది. అదే విధంగా మహిళల్లో కూడా ఉంది. అందుకే కొన్ని కుటుంబాలలో ఆయా నాయకుల భార్యలను ఆయా పదవులలో నియమించడం జరిగిందన్నారు. ఇక్కడ నుంచి తయారైన మైనారీటి నేతలు ఎదిగే అవకాశం జగన్ అనుసరిస్తున్న విధానం వల్ల కలుగుతుంది అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలయ్యేసరికి ఇక్కడనుంచి తయారైన మైనారీటీలు వందల వేలమంది నాయకత్వం వహించే అవకాశం కలుగుతుందన్నారు. నామినేటెడ్ పదవులలో పదవులు దక్కించుకున్నారు. రానున్న కాలంలో శాసనసభకు,రాజ్యసభకు, లోక్ సభకు పోటీ పడే పరిస్దితి వస్తుందన్నారు.అలాంటి పరిస్దితిని క్రియేట్ చేయడం జగన్ గొప్పతనం అన్నారు. సమావేశంలో శాసనమండలి లో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, మైనారీటి సెల్ నేతలు ఫరూకీ, హంజా ఉస్సేనీ, శాసనమండలి సభ్యులు ఇషాక్ భాషా, పార్టీ మైనారీటి సెల్ రీజనల్ కోఆర్డినేటర్ లు భర్కత్ అలీ, షఫీ అహ్మద్ ఖాధ్రీ, బషీరుద్దీన్, జానీభాషా, ఇమాం హుస్సేన్ పాల్గొన్నారు.