కడప : జననేత వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా తో పాటు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రాష్ట్ర చైర్మన్లు యానాదయ్య, కరీముల్లా, పులి సునీల్ కుమార్,సీనియర్ నాయకులు మాసిమా బాబు, అఫ్జల్ ఖాన్, నారపు రెడ్డి సుబ్బారెడ్డి, డాక్టర్ సోహెల్ అహ్మద్, బంగారు నాగయ్య యాదవ్, తోట కృష్ణ, ఆదిత్య, పత్తి రాజేశ్వరి, టి.పి.సుబ్బమ్మ, కృష్ణవేణి, రత్నకుమారి, మూల సరస్వతి,రాష్ట్ర డైరెక్టర్లు,కార్పొరేటర్లు, నాయకులు నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.