విజయవాడ : అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలి. అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటా’’ అని వివరించారు. కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి సంజీవ్ కుమార్‌ను తప్పించడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.