మే నెలల్లో కలిపి మొత్తం 21 సీట్లు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటాలో
నియమితులైన మరో ఇద్దరి పదవీకాలం జులై 20తో ముగియనుంది. దీంతో అదృష్టాన్ని
పరీక్షించుకునేందుకు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం జగన్ ఇప్పటికే
చాలామందికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక
కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. త్వరలో ఖాళీ కానున్న
ఎమ్మెల్సీ సీట్లపై వైసీపీలో నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ
ఎన్నికలు సమీపిస్తున్నందున.. ఈసారి పదవులను ఆచితూచి ఇచ్చే అవకాశం ఉంది.ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలకు, మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు
తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పట్టభద్రులు, ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉండటంతో వీటిపైనా
దృష్టిసారించింది. మార్చి 29తో ఖాళీ కానున్న మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ
స్థానాలకు అభ్యర్థులను జగన్ ఇప్పటికే ఖరారు చేశారు. ఈ ముగ్గురిని గెలిపించే
బాధ్యతలను ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు
ముఖ్యమంత్రి అప్పగించారు. మార్చి 29న ఖాళీ కానున్న ఉపాధ్యాయ నియోజకవర్గాల
అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అనేక మందికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని హామీ
ఇచ్చారు. మర్రి రాజశేఖర్, మేకా శేషుబాబు, దుట్టా రామచంద్రారావు, నర్తు
రామారావు, జంకెం వెంకటరెడ్డి, కనకారావు, మహాలక్ష్మి శ్రీనివాస్, వంకా
రవీంద్రనాథ్‌బాబు, గుణ్నం నాగబాబు, గురునాథరెడ్డి , నవీన్ నిశ్చల్ ,
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఒకటి, బొప్పన భవకుమార్ వంటివారు హామీ
పొందిన వారిలో ఉన్నారు.
ఇప్పుడు పదవి దక్కకుంటే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారే అవకాశం
ఉంది. ఎమ్మెల్యే సీట్ల సర్దబాట్లలో భాగంగా మరికొందరికి పదవులు కేటాయించాల్సి
ఉంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కుటుంబంలో ఒకరికి మళ్లీ
ఇచ్చే అవకాశం ఉంది. డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత టీడీపీ
ఎమ్మెల్సీలుగా ఉంటూ ఆ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ రెండు
స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ తరఫున మళ్లీ వారిద్దరికే అవకాశమిచ్చి
గెలిపించారు. వారిద్దరి పదవీకాలమూ మార్చి 29న ముగియనుంది. వారిని
కొనసాగిస్తారా లేదా అనే విషయంలోనూ స్పష్టత లేదు.స్థానిక సంస్థల కోటాలోని 9
ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నందున వాటిలో అవకాశం దక్కించుకోవాలనుకునే వారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపగలిగేలా ఉండాలనేది ప్రామాణికంగా
తీసుకుంటున్నారని తెలుస్తోంది. పశ్చిమగోదావరిలో 2, అనంతపురం, కడప, కర్నూలు,
చిత్తూరు, ఉమ్మడి తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరులలో ఒక్కొక్కటి చొప్పున
ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ 9 స్థానాలు ప్రస్తుతం తెదేపావి.
స్థానిక సంస్థల్లో సంఖ్యాబలం ఉన్నందున ఈ 9 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోగలదు.