పోలాకి : పరిపాలనలో నూతన శకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి పరిపాలనకు మెచ్చి, మంచిలో భాగస్వాములు కావాలని బొద్ధం పంచాయతీ
వనవిష్ణుపురంలో మాజీ సర్పంచ్ పాలిన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 79
కుటుంబాల మద్దతు దారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గ్రామంలో
అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి వైసీపీ జిల్లా
అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ స్వయంగా పార్టీ కండువా వేసి ఆత్మీయంగా
ఆహ్వానించారు. జగనన్నను ఆశీర్వదించి, పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న
యుద్ధంలో మద్దతు పలకాలని కృష్ణ దాస్ ఈ సందర్భంగా వారిని కోరారు. అలాగే కుసుమ
పోలవలసలో కూడా 21 టిడిపి సానుభూతిపరులకు చెందిన కుటుంబాలు మాజీ డిప్యూటీ సీఎం
సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, డిసిసిబి
చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు ముద్దాడ
బైరాగినాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు కణితి కృష్ణమూర్తి, ఇచ్చాపురం మున్సిపల్
చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.