న్యూఢిల్లీ : దళిత యువకుడు, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన
నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్
నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం పేర్కొంది. తన బెయిల్
పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అనంతబాబు సుప్రీంకోర్టును
ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి
సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ పత్రాలు అందిన తర్వాత అనంతబాబును విడుదల
చేసే అవకాశముంది.